ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
తొంబదినాలుఁగవ పద్యము:
చంపకమాల:
అన, విను శ్రీవరా! గిరిధరా! కన, నాయమ కృష్ణ మీర! క
న్గొని, నిను వే కడుం దనివి, గోపిక రీతినిఁ దాన యెంచి, పా
వన మన మూన్చెఁ! దన్మధుర భక్తినిఁ బాడిన మాన్య కిత్తె ధీ
యు, నభవమున్, భువిన్ బుధ నియోగ్య మహత్కృతిఁ బూజ్య! కేశవా! 94
గర్భిత కందము:
విను శ్రీవరా! గిరిధరా!
కన, నాయమ కృష్ణ మీర! కన్గొని నిను, వే
మన మూన్చెఁ! దన్మధుర భ
క్తినిఁ బాడిన మాన్య కిత్తె ధీయు, నభవమున్! 94
గర్భిత తేటగీతి:
గిరిధరా! కన, నాయమ కృష్ణ మీర!
తనివి, గోపిక రీతినిఁ దాన యెంచి,
మధుర భక్తినిఁ బాడిన మాన్య కిత్తె
బుధ నియోగ్య మహత్కృతిఁ బూజ్య! కేశ! 94
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి