ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
తొంబదియాఱవ పద్యము:
చంపకమాల:
ఘన! భవనాశకా! యమర, ఖాండవ మేర్చఁగ నగ్ని వేఁడ, న
ప్ప నతిఘ మీన్, వెసం బుడికి పార్థుఁడు నీవునుఁ బోటుముట్ల, దీ
క్షను, నవ శక్తిమైఁ గదలి, గాండివి కాల్పఁగ ఖాండవమ్ము, ఠీ
వినిఁ గనవే! హరీ! యిడవె వేగమె సాయము నీశ! కేశవా! 96
గర్భిత కందము:
భవనాశకా! యమర, ఖాం
డవ మేర్చఁగ నగ్ని వేఁడ, నప్ప నతిఘ మీన్,
నవ శక్తిమైఁ గదలి, గాం
డివి కాల్పఁగ ఖాండవమ్ము, ఠీవినిఁ గనవే! 96
గర్భిత తేటగీతి:
అమర, ఖాండవ మేర్చఁగ నగ్ని వేఁడఁ,
బుడికి పార్థుఁడు నీవునుఁ బోటుముట్లఁ,
గదలి, గాండివి కాల్పఁగ ఖాండవమ్ము,
నిడవె వేగమె సాయము నీశ! కేశ! 96
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి