Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జనవరి 04, 2016

సమస్య: పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!

తేది: సెప్టెంబర్ 26, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు



నా మొదటి పూరణము:
ఇదె యష్టాదశ వర్ణన,
మిదె తత్సంఖ్యా పురాణ, మిదె స్మృతి సంఖ్య,
మ్మిది ధాన్య, జాతి, విద్యయుఁ
బదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!


(ఈ పూరణమున ద్వితీయ పాదాంతమందు "సంఖ్యమ్ము" సంఖ్యగాఁ గాక, "యుద్ధ"మను నర్థము నిచ్చుచున్నదని డా. విష్ణునందన్ గారు...
[సుకవి శ్రీ గుండు మధుసూదన్ గారి మధురమైన పూరణల్లో ఒకానొక పూరణలో ఒక చోట సంఖ్యా శబ్దాన్ని సంఖ్యమని అకారాంత నపుంసక లింగముగా అని వాడినట్లున్నారు, ' లెక్క ' అనే అర్థంలో సంఖ్యా శబ్దం నిరంతరాకారాంత స్త్రీ లింగమే ! అకారాంత నపుంసకమైతే యుద్ధమనే రూఢి !]
...అని తెలిపినందున, సవరించిన పూరణము నీ దిగువన నిచ్చుచున్నాను)


సవరించిన నా పూరణము:
ఇదె యష్టాదశ వర్ణన,
మిదె తత్సంఖ్యా పురాణ, మిదె స్మృతి గణణ,
మ్మిది ధాన్య, జాతి, విద్యయుఁ
బదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!




నా రెండవ పూరణము:
(శ్రీ కంది శంకరయ్యగారిచ్చిన సమస్యల సంఖ్య దీనితో పదునెనిమిది వందల సంఖ్య యైనందున)
పదునౌ సమస్య లివియుం
బదునెనిమిది వందలయ్యెఁ బరిశీలింపన్
బదుగు రివి మెచ్చు వందలు
పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!


నా మూఁడవ పూరణము:
పదపడి చేయంబోకుఁడు
పది యేఁడుల పాపల కిల వైవాహికముల్
సుదతులకుఁ బెండ్లి వయసది
పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!

7 కామెంట్‌లు:

  1. చాలా బాగుందండి.
    గోగులపాటి కృష్ణమోహన్
    SK 326, హైదరాబాదు

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుందండి.
    గోగులపాటి కృష్ణమోహన్
    SK 326, హైదరాబాదు

    రిప్లయితొలగించండి
  3. పదునెనిమిదేళ్ళు దాటగ
    పదపడి వోటరు నమోదు పత్రములో చే
    ర్చుదురు యువతీ యువకులను
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే .

    రిప్లయితొలగించండి
  4. మధురకవీ పూరణములు చాలా బాగున్నాయి

    రిప్లయితొలగించండి
  5. మధురకవీ పూరణములు చాలా బాగున్నాయి

    రిప్లయితొలగించండి