తేది: సెప్టెంబర్ 26, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన దత్తవాక్యమునకు నేను రాసిన పద్యము
(హరిభక్తుఁడగు నంబరీషునిపైఁ గినిసిన దుర్వాసమహర్షి కృత్యనుం బ్రయోగింపఁగఁ, గోపించిన శ్రీహరి, దుర్వాసునిపైఁ జక్రాయుధమునుం బ్రయోగింపఁగ, దానినుండి తప్పించుకొను నుపాయ మెఱుంగక తనలోఁ దా నిట్లనుకొని చింతించిన వైనము నిట ననుసంధానించుకొనునది)
ఎక్కడి కేఁగువాఁడ? నిపు డెవ్వని వేడుదుఁ? జక్ర మీ విధిన్
జక్కఁగ నాదు వెంటఁబడె! శంభుఁ డజుండును బ్రోవ మందురే!
నిక్కపు విష్ణుభక్తునకు నేనిటు చేసితిఁ గీడు! పక్కి రా
జక్కిదొరా! బిరాన ననుఁ జక్రము బారిని నుండి కావరా!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి