తేది: మే 11. 2014 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్శ్జికన ఈయబడిన "జోలపాట" అంశమునకు నేను రాసిన పద్యము
జోజో సూర్య కుల ప్రదీప విభవా! జోజో ఘనాభాజిరా!
జోజో కౌశిక యజ్ఞ రక్షణ పరా! జోజో హరేష్వాసభిత్!
జోజో రావణ కుంభకర్ణ హననా! జోజో నిలింపావనా!
జోజో రామమహీశ! చంద్రవదనా! జోజో మహీజాపతీ!
(భావం: సూర్యవంశమునకు దీప్తిని, వైభవమునుఁ గలిగించినవాఁడా; మేఘమునుబోలు శరీకాంతిగలవాఁడా; కౌశికుని యజ్ఞమును గాఁచినవాఁడా; [హర+ఇష్వాస-భిత్] శివధనువును ద్రుంచినవాఁడా; రావణకుంభకర్ణాదులను హతమార్చినవాఁడా; దేవతలను గాఁచినవాఁడా; రామభూపాలా; చంద్రునివంటి ముఖముగలవాఁడా; భూపుత్రి సీతకుఁ బతియైనవాఁడా నీకు జోలలు!)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి