ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
నూటయైదవ పద్యము:
చంపకమాల:
ధ్రువ! నినుఁ గేశవున్ శతక రూపునఁ గొల్చియు, సన్నుతింపఁ, బ్రో
వవె వెస నన్! హరీ! పుడమి వర్ధిలఁ, బొత్త మపూర్వరీతిఁ జూ
పవె! ఘనదైవమా! కవుల పంక్తినిఁ జేర్చియు, గారవించి, తే
ర్పవె జగతిన్! గడున్ భువిని వ్యాప్తము సేయవె! పూజ్య! కేశవా! 105
గర్భిత కందము:
నినుఁ గేశవున్ శతక రూ
పునఁ గొల్చియు, సన్నుతింపఁ, బ్రోవవె వెస నన్!
ఘనదైవమా! కవుల పం
క్తినిఁ జేర్చియు, గారవించి, తేర్పవె జగతిన్! 105
గర్భిత తేటగీతి:
శతక రూపునఁ గొల్చియు, సన్నుతింపఁ,
బుడమి వర్ధిలఁ, బొత్త మపూర్వరీతిఁ
గవుల పంక్తినిఁ జేర్చియు, గారవించి,
భువిని వ్యాప్తము సేయవె! పూజ్య! కేశ! 105
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి