ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
తొంబదిరెండవ పద్యము:
చంపకమాల:
హిత! ఖగవాహనా! క్రమత నింపగు భక్తిని రామదాసు ప
న్ని, తనరుచున్ గడున్ రమణ, నీపయిఁ గీర్తనలన్ రచించి, స
ద్వ్రత! నిగమోన్నతా! కదలి, భద్రగిరిన్ గుడిఁ గట్ట నీకుఁ, బ్రా
జ్ఞ! తరలవే! హరీ! యెలమిఁ గావవె మోక్షము నిచ్చి! కేశవా! 92
గర్భిత కందము:
ఖగవాహనా! క్రమత నిం
పగు భక్తిని రామదాసు పన్ని, తనరుచున్
నిగమోన్నతా! కదలి, భ
ద్రగిరిన్ గుడిఁ గట్ట నీకుఁ, బ్రాజ్ఞ! తరలవే! 92
గర్భిత తేటగీతి:
క్రమత నింపగు భక్తిని రామదాసు,
రమణ, నీపయిఁ గీర్తనలన్ రచించి,
కదలి, భద్రగిరిన్ గుడిఁ గట్ట నీకు!
నెలమిఁ గావవె మోక్షము నిచ్చి! కేశ! 92
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి