ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
డెబ్బదియాఱవ పద్యము:
చంపకమాల:
జన గుణపోషకా! ప్రణవ! సద్గుణ షోడశ! రాఘవాఖ్య! కూ
ర్మిని నిలలో హరీ! యతుల రీతిని రామకథామృతమ్ము ని
మ్మున గణియించుచున్ మునియె ప్రోద్గుణి వాల్మికి పూని వ్రాసి, భూ
ర్ణిని నిలిపెన్! దివిన్ ముని విరించులఁ బ్రీతిని ముంచెఁ గేశవా! 76
గర్భిత కందము:
గుణపోషకా! ప్రణవ! స
ద్గుణ షోడశ! రాఘవాఖ్య! కూర్మిని నిలలో
గణియించుచున్ మునియె ప్రో
ద్గుణి వాల్మికి పూని వ్రాసి, భూర్ణిని నిలిపెన్! 76
గర్భిత తేటగీతి:
ప్రణవ! సద్గుణ షోడశ! రాఘవాఖ్య!
యతుల రీతిని రామకథామృతమ్ము
మునియె ప్రోద్గుణి వాల్మికి పూని వ్రాసి,
ముని విరించులఁ బ్రీతిని ముంచెఁ గేశ! 76
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి