Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 24, 2021

ఎనుబదినాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదినాలుఁగవ పద్యము:

చంపకమాల:
క్రతు! నిగమోన్నతా! యజగరమ్ముగ మాఱి యఘాసురుండు, భూ
నుత! కనుచున్, నినుం బసులనుం బశుపాలురఁ బట్టి, వేగ, సూ
నృత! జగదీశ్వరా! మెఱసి, మ్రింగఁగ, గొంతున మేనుఁ బెంచి, క
న్న! తునిమితే! హరీ! సఖుల నచ్చికఁ  గాచితె! శౌరి! కేశవా! 84

గర్భిత కందము:
నిగమోన్నతా! యజగర
మ్ముగ మాఱి యఘాసురుండు, భూనుత! కనుచున్,
జగదీశ్వరా! మెఱసి, మ్రిం
గఁగ, గొంతున మేనుఁ బెంచి, కన్న! తునిమితే! 84

గర్భిత తేటగీతి:
అజగరమ్ముగ మాఱి యఘాసురుండు,
పసులనుం బశుపాలురఁ బట్టి, వేగ,
మెఱసి, మ్రింగఁగ, గొంతున మేనుఁ బెంచి,
సఖుల నచ్చికఁ  గాచితె! శౌరి! కేశ! 84



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి