Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 24, 2021

ఎనుబదియైదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదియైదవ పద్యము:

చంపకమాల:
ధ్రువ! భువి నాశియై చెలఁగు ధుంధువుఁ జెచ్చెరఁ ద్రెళ్ళఁజేయ, నూ
త్న విభలతో, హరీ! సువదనా! కువలాశ్వునిఁ జొచ్చి, యీవు మా
ధవ! రవళించుచున్, నియతి దానవుఁ జంపఁగ, నిర్జరాళి న
ప్పి వొగడరే! కనన్ జనులు ప్రీతిని నొందరె! శార్ఙ్గి! కేశవా! 85

గర్భిత కందము:
భువి నాశియై చెలఁగు ధుం
ధువుఁ జెచ్చెరఁ ద్రెళ్ళఁజేయ, నూత్న విభలతో
రవళించుచున్, నియతి దా
నవుఁ జంపఁగ, నిర్జరాళి నప్పి, వొగడరే! 85

గర్భిత తేటగీతి:
చెలఁగు ధుంధువుఁ జెచ్చెరఁ ద్రెళ్ళఁజేయ,
సువదనా! కువలాశ్వునిఁ జొచ్చి, యీవు
నియతి దానవుఁ జంపఁగ, నిర్జరాళి,
జనులు ప్రీతిని నొందరె! శార్ఙ్గి! కేశ! 85



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి