Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 13, 2021

డెబ్బదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదవ పద్యము:

చంపకమాల:
నతి భువనేశ్వరా! నినుఁ గొనన్, యవనున్ గమనింపఁ ద్రిప్పి, యా
గత బిలమున్, గడున్ గుణవికాసు యతిన్ ముచికుందుఁ జేర, స
త్స్థితి జవయుక్తిమై పరుగుదీసి, వధన్ మునివర్యు కిత్తె! చి
జ్జిత గతివై! హరీ! ప్రణతి శ్రీధర! కైటభవైరి! కేశవా! 70

గర్భిత కందము:
భువనేశ్వరా! నినుఁ గొనన్,
యవనున్ గమనింపఁ ద్రిప్పి, యాగత బిలమున్,
జవయుక్తిమై పరుగుదీ
సి, వధన్ మునివర్యు కిత్తె! చిజ్జిత గతివై! 70

గర్భిత తేటగీతి:
నినుఁ గొనన్, యవనున్ గమనింపఁ ద్రిప్పి,
గుణవికాసు యతిన్ ముచికుందుఁ జేరఁ,
బరుగుదీసి, వధన్ మునివర్యు కిత్తె!
ప్రణతి శ్రీధర! కైటభవైరి! కేశ! 70



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి