Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 29, 2021

తొంబదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


తొంబదవ పద్యము:

ఉత్పలమాల:
ఓ యవనారి! నీ వఘసముద్భవనాశకమౌ పథమ్ముఁ, బా
రాయణకై తగం బరమ రమ్యమునౌ ఘనభాగ్యరాశి న
య్యా! యవతారకా! భువిని నౌర! వెలార్చితె మొల్ల సేఁత రా
మాయణమున్! హరీ రచన మాదృతిఁ దేర్చితె! ప్రాజ్ఞ! కేశవా! 90

గర్భిత కందము:
యవనారి! నీ వఘసము
ద్భవనాశకమౌ పథమ్ముఁ, బారాయణకై
యవతారకా! భువిని నౌ
ర! వెలార్చితె మొల్ల సేఁత రామాయణమున్! 90

గర్భిత తేటగీతి:
అఘసముద్భవనాశకమౌ పథమ్ముఁ,
బరమ రమ్యమునౌ ఘనభాగ్యరాశి,
భువిని నౌర! వెలార్చితె మొల్ల సేఁత!
రచన మాదృతిఁ దేర్చితె! ప్రాజ్ఞ! కేశ! 90




స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి