ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
అఱువదియేడవ పద్యము:
చంపకమాల:
చని, దెసకుం గడున్ శఠుఁడు చక్రసమీరనిశాచరుండు గా
లినిఁ బనుపన్, హరీ! నిను సుడిన్ వడిఁ ద్రిప్పుచు, నింగిఁ జేర, వెం
టనె వసుషేణ! నీ వపు వనంత సహిష్ణుత భార మాన్చి, ద
ర్పి నడఁపితే! ఖలుం గడపి, ప్రీతిఁ బ్రజన్ వెసఁ గాతె! కేశవా! 67
గర్భిత కందము:
దెసకుం గడున్ శఠుఁడు చ
క్రసమీరనిశాచరుండు గాలినిఁ బనుపన్,
వసుషేణ! నీ వపు వనం
త సహిష్ణుత భార మాన్చి, దర్పి నడఁపితే! 67
గర్భిత తేటగీతి:
శఠుఁడు చక్రసమీరనిశాచరుండు
నిను సుడిన్ వడిఁ ద్రిప్పుచు, నింగిఁ జేర,
వపు వనంత సహిష్ణుత భార మాన్చి,
కడపి, ప్రీతిఁ బ్రజన్ వెసఁ గాతె! కేశ! 67
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి