Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 11, 2021

అఱువదియాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదియాఱవ పద్యము:

ఉత్పలమాల:
శ్రీవ్రత! సన్నుతా! సరసి చిత్సతి, మత్స్య ప్రశస్తరూప! స
త్యవ్రత సత్కృతిం గదిసి, తత్క్రమ వృద్ధినిఁ గాంచి, కాంచి, సు
ష్ఠువ్రతివై, కడున్నెదిగి శోభిత మత్స్యపరేశుఁడైతె వే
తీవ్ర హృతిన్! హరీ! భువినిఁ దేర్చితె, రక్షనుఁ బూన్చి! కేశవా! 66

గర్భిత కందము:
వ్రత సన్నుతా! సరసి చి
త్సతి మత్స్య ప్రశస్తరూప! సత్యవ్రత స
ద్వ్రతివై, కడున్నెదిగి శో
భిత మత్స్యపరేశుఁడైతె పెందీవ్ర హృతిన్! 66

గర్భిత తేటగీతి:
సరసి చిత్సతి, మత్స్య ప్రశస్తరూప!
కదిసి, తత్క్రమ వృద్ధినిఁ గాంచి, కాంచి,
యెదిగి శోభిత మత్స్యపరేశుఁడైతె!
భువినిఁ దేర్చితె, రక్షనుఁ బూన్చి! కేశ! 66



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి