ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
ఏఁబదినాలుఁగవ పద్యము:
చంపకమాల:
భువి జన సంస్తుతా! పితయె పొమ్మనఁ గానకు, వేగఁ జేరి, య
ర్కవరకులా! హరీ! సతియు, గాదిలి తమ్ముఁడు సంతసింప, శ్రీ
ధవ! ఘన వర్తనా! బరఁగ దానినె స్వర్గము పాటిదంచు, ని
ల్చి, వఱలితే! విధిన్ బ్రచుర ప్రీతినిఁ దాల్చితె! రామ! కేశవా! 54
గర్భిత కందము:
జన సంస్తుతా! పితయె పొ
మ్మనఁ గానకు, వేగఁ జేరి, యర్కవరకులా!
ఘన వర్తనా! బరఁగ దా
నినె స్వర్గము పాటిదంచు, నిల్చి, వఱలితే! 54
గర్భిత తేటగీతి:
పితయె పొమ్మనఁ గానకు, వేగఁ జేరి,
సతియు, గాదిలి తమ్ముఁడు సంతసింపఁ,
బరఁగ దానినె స్వర్గము పాటిదంచుఁ,
బ్రచుర ప్రీతినిఁ దాల్చితె! రామ! కేశ! 54
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి