ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
అఱువదియైదవ పద్యము:
చంపకమాల:
ధ్రువ! దనుజాంతకా! క్రమణ రూపునిఁ గేశినిఁ గంసుఁ డంపఁ, బో
యి, వెఱపిడన్, వెసన్ బెగడు హెచ్చిన గొల్లల, వీక్ష సేసి, ప్రో
వవె! ఘన హుంకృతిన్ నవయు భంగినిఁ జంపవె! నాఁటినుండి కే
శవుఁ డయితే! హరీ! జనులఁ జల్లఁగఁ గావవె! చక్రి! కేశవా! 65
గర్భిత కందము:
దనుజాంతకా! క్రమణ రూ
పునిఁ గేశినిఁ గంసుఁ డంపఁ, బోయి, వెఱపిడన్,
ఘన హుంకృతిన్ నవయు భం
గినిఁ జంపవె! నాఁటినుండి కేశవుఁ డయితే! 65
గర్భిత తేటగీతి:
క్రమణ రూపునిఁ గేశినిఁ గంసుఁ డంప,
బెగడు హెచ్చిన గొల్లల, వీక్ష సేసి,
నవయు భంగినిఁ జంపవె! నాఁటినుండి
జనులఁ జల్లఁగఁ గావవె! చక్రి! కేశ! 65
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి