ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
డెబ్బదియైదవ పద్యము:
చంపకమాల:
జిన! వనజోదరా! "మను భుజించెను తమ్ముఁడు! మాత!" యంచుఁ జెం
తనె వినుచన్, నుడుల్ విని, ఘనా! ముఖ మందున, వీక్ష సేయ వి
ష్ణుని నిను, నోటిలో జగముఁ జూపిన కృష్ణ! ప్రసన్నరూప! వే
దన నడఁతే! హరీ! వెసనుఁ దల్లినిఁ దన్పితె! వృష్ణి! కేశవా! 75
గర్భిత కందము:
వనజోదరా! "మను భుజిం
చెను తమ్ముఁడు! మాత!" యంచుఁ జెంతనె వినుచన్
నిను, నోటిలో జగముఁ జూ
పిన కృష్ణ! ప్రసన్నరూప! వేదన నడఁతే! 75
గర్భిత తేటగీతి:
"మను భుజించెను తమ్ముఁడు! మాత!" యంచు
విని, ఘనా! ముఖ మందున వీక్ష సేయ,
జగముఁ జూపిన కృష్ణ! ప్రసన్నరూప!
వెసనుఁ దల్లినిఁ దన్పితె! వృష్ణి! కేశ! 75
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి