Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 09, 2021

అఱువదినాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదినాలుఁగవ పద్యము:

చంపకమాల:
భువి, బలిబంధనా! సగరపుత్రులు యాగపు సైంధవార్తి, దో
ష విషయులై చనం, గపిల! సంయతి భూమినిఁ గాంచి, నిన్ను భూ
ధవ! కలహాత్ములై తెగడ, దంభులఁ గాంచితె తీక్ష్ణ నేత్ర! బూ
ది వఱపితే! హరీ! నయ విధేయులఁ దేర్చితె! నంద! కేశవా! 64

గర్భిత కందము:
బలిబంధనా! సగరపు
త్రులు యాగపు సైంధవార్తి, దోష విషయులై
కలహాత్ములై తెగడ, దం
భులఁ గాంచితె తీక్ష్ణ నేత్ర! బూది వఱపితే! 64

గర్భిత తేటగీతి:
సగరపుత్రులు యాగపు సైంధవార్తిఁ,
గపిల! సంయతి భూమినిఁ గాంచి, నిన్నుఁ
దెగడ, దంభులఁ గాంచితె తీక్ష్ణ నేత్ర!
నయ విధేయులఁ దేర్చితె! నంద! కేశ! 64



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి