Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 22, 2021

డెబ్బదితొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదితొమ్మిదవ పద్యము:

చంపకమాల:
కొని మరణాంత్య దుర్నియతిఁ, గొక్కెర రక్కసి నిన్ను మ్రింగఁ, గీ
ల్కొని కుతుకన్ గడున్ జ్వలతఁ గూర్చితె! మండఁగ, వాఁడు వేఁగి, గ్ర
క్కున హరి! నిన్నుఁ దాఁ బొసఁగఁ గ్రుమ్మరి క్రక్కఁగ, ముక్కుఁ జీల్చి, మ్రం
ద నుఱిమితే! వెసన్ స్మయ మొనర్చితె చూడ్కికి! శౌరి! కేశవా! 79

గర్భిత కందము:
మరణాంత్య దుర్నియతిఁ, గొ
క్కెర రక్కసి నిన్ను మ్రింగఁ, గీల్కొని కుతుకన్,
హరి! నిన్నుఁ దాఁ బొసఁగఁ గ్రు
మ్మరి క్రక్కఁగ, ముక్కుఁ జీల్చి, మ్రంద నుఱిమితే! 79

గర్భిత తేటగీతి:
నియతిఁ, గొక్కెర రక్కసి నిన్ను మ్రింగఁ,
జ్వలతఁ గూర్చితె! మండఁగ, వాఁడు వేఁగి,
పొసఁగఁ గ్రుమ్మరి క్రక్కఁగ, ముక్కుఁ జీల్చి,
స్మయ మొనర్చితె చూడ్కికి! శౌరి! కేశ! 79



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి