ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
అఱువదిమూఁడవ పద్యము:
చంపకమాల:
పృథుచతురబ్ధిసంవృతధరిత్రి తఱంకియుఁ, బెల్లగిల్ల, ధీ
పృథు నృప! త్వత్ క్రుధన్, దఱుమ, భీతిలి, పట్టువడంగఁ, జేరి, స
న్నిధి ధృత ధేనువౌ పృథివినిం బితుకంగనె, వెల్గె నుర్వి! పె
న్నిధు లొదవెన్! హరీ! పృథువు నీ కళ యౌట! విరించి! కేశవా! 63
గర్భిత కందము:
చతురబ్ధిసంవృతధరి
త్రి తఱంకియుఁ, బెల్లగిల్ల, ధీ పృథు నృప! త్వత్
ధృత ధేనువౌ పృథివినిం
బితుకంగనె, వెల్గె నుర్వి! పెన్నిధు లొదవెన్! 63
గర్భిత తేటగీతి:
వృతధరిత్రి తఱంకియుఁ, బెల్లగిల్లఁ
దఱుమ, భీతిలి, పట్టువడంగఁ, జేరి,
పృథివినిం బితుకంగనె, వెల్గె నుర్వి!
పృథువు నీ కళ యౌట! విరించి! కేశ! 63
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి