ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
ఏఁబదియాఱవ పద్యము:
చంపకమాల:
అనుచరియై వెసం గుతిని నాసుర, తాఁ జని, కోరి నిన్ను, శూ
ర్పణఖ యటం ద్వరన్ మనుజ భామిని రూపున, మైక మొప్ప, నిన్
గని, సురతం బిడం బనవఁ, గ్రమ్మఱ లక్ష్మణు పాలి కంపి, మా
య నడఁపితే! హరీ! యసుర కందము వాపితె! యయ్య! కేశవా! 56
గర్భిత కందము:
చరియై వెసం గుతిని నా
సుర, తాఁ జని, కోరి నిన్ను, శూర్పణఖ యటన్
సురతం బిడం బనవఁ, గ్ర
మ్మఱ లక్ష్మణు పాలి కంపి, మాయ నడఁపితే! 56
గర్భిత తేటగీతి:
కుతిని నాసుర, తాఁ జని, కోరి నిన్ను,
మనుజ భామిని రూపున, మైక మొప్పఁ
బనవఁ, గ్రమ్మఱ లక్ష్మణు పాలి కంపి,
యసుర కందము వాపితె! యయ్య! కేశ! 56
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి