కవి పండిత మిత్ర వీక్షకులకు
భోగి పర్వదిన శుభాకాంక్షలు!
తేది: జూన్ 30, 2012 నాటి శంకరాభరణంలోని
పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు
నేను రాసిన పద్యములు
సిరి రూపము తానె, గిరిజ రూపము తానే,
తరుణియె క్షమాస్వరూపిణి,
మరియాదకు మాఱుపేరు మహిళయె కాదా !
“ఆఁడపిల్ల యేనాఁడును నాడ పిల్లె,
యీడ పిల్లయె కా” దంచు నెగురు వార
‘లాఁడపిల్ల మహాలక్ష్మి’ యనెడు మాట
వినఁగ లేదొక్కొ లోకాన వీను లలర !
కట్న మీయంగ లేమని, కసిని బూని
బాలికను గర్భమునఁ జంపఁ బాప మనెడు
త్రాసమే లేక తెగటార్ప ధర్మ మగునె?
రూపుమాపుఁడు మీరు స్త్రీ భ్రూణ హత్య !
తరుణియె క్షమాస్వరూపిణి,
మరియాదకు మాఱుపేరు మహిళయె కాదా !
“ఆఁడపిల్ల యేనాఁడును నాడ పిల్లె,
యీడ పిల్లయె కా” దంచు నెగురు వార
‘లాఁడపిల్ల మహాలక్ష్మి’ యనెడు మాట
వినఁగ లేదొక్కొ లోకాన వీను లలర !
కట్న మీయంగ లేమని, కసిని బూని
బాలికను గర్భమునఁ జంపఁ బాప మనెడు
త్రాసమే లేక తెగటార్ప ధర్మ మగునె?
రూపుమాపుఁడు మీరు స్త్రీ భ్రూణ హత్య !
పుట్టి పుట్టంగనే పుణ్యాల ప్రోవయి
రిప్లయితొలగించండికన్న వారికి గూర్చు కామ్యఫలము
బుడి బుడి నడకల బుజ్జాయి నవ్వులు
నట్టింట ముత్యాల నగలు పేర్చు
పరికిణీ గట్టిన పాపాయి సొబగులు
మురిపాల ముద్దులు మూట గట్టు
పెళ్ళీడు దరిసిన ప్రియ తనయ దిరుగు
నాయింట లక్ష్మీ విహార మొరయు
ఘనులు కడుపార కూతుర్ని గన్నవారు
ఆడ పిల్లయె సర్వస్వ మవని యందు
తల్లి దండ్రులు తనివార తమకు దాము
మురియు ననుభూతు లేమని బొగడ వచ్చు !
-----సుజన-సృజన
మాన్యులు లక్కాకులవారూ, తమరి పద్యము బాగుగ నున్నది. అయితే, ఒకచోట "కూతుర్ని" అన్నారు. ఇది వ్యావహారికము. దీనిని "కూఁతురిం" అని మార్చిన సరిపోవును. స్పందించి పద్యము రాసినందులకు ధన్యవాదములు.
తొలగించండివేరుగ భావించ వలదు
తొలగించండిసారీ , ‘ గ్రామీణ భాష ‘ సౌరులు హృదికిన్
సౌరభములు గురిపించును
వారింపను మనసు రాదు పద్యములందున్
ధన్యవాదాలు లక్కాకులవారూ! తెలుగు పద్యంబు నిత్యమై తేజరిల్లు. స్వస్తి.
తొలగించండి