తేది: జూలై 01, 2012 నాటి శంకరాభరణంలోని
పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు
నేను రాసిన సీసపద్యము
"జన గణ మన" యంచు జాతీయగీతమ్ము
....ప్రజల కిచ్చియు, మెప్పు బడసె నెవఁడు?
గీతాలతో భక్తి గీతాంజలి రచించి,
....నోబెలు బహుమతి నొందె నెవఁడు?
విశ్వకవీశుఁడన్ బిరుదుతో లోకాన
....ఖ్యాతి వహించిన ఘనుఁ డెవండు?
శాంతినికేతన స్థాపనంబును జేసి,
....లలితకళలఁ బెంచి, వెలిఁగె నెవఁడు?
తానె, ఠాగూరువంశ సత్కవివరుండు;
విశ్వభారతీ హృదయ సంవేద్యయోగి;
భరతమాతాఖ్య సత్పుత్రవర విశిష్టుఁ,
డల రవీంద్రనాథుండు, విమలగుణుండు!
....ప్రజల కిచ్చియు, మెప్పు బడసె నెవఁడు?
గీతాలతో భక్తి గీతాంజలి రచించి,
....నోబెలు బహుమతి నొందె నెవఁడు?
విశ్వకవీశుఁడన్ బిరుదుతో లోకాన
....ఖ్యాతి వహించిన ఘనుఁ డెవండు?
శాంతినికేతన స్థాపనంబును జేసి,
....లలితకళలఁ బెంచి, వెలిఁగె నెవఁడు?
తానె, ఠాగూరువంశ సత్కవివరుండు;
విశ్వభారతీ హృదయ సంవేద్యయోగి;
భరతమాతాఖ్య సత్పుత్రవర విశిష్టుఁ,
డల రవీంద్రనాథుండు, విమలగుణుండు!
విశ్వకవి రవీంద్రునిపై మీరు వ్రాసిన పద్యాలు అద్భుతంగా ఉన్నాయి.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
తొలగించండివిశ్వ కవుల కీర్తి వినుతించి వ్రాసిన
రిప్లయితొలగించండితెలుగు పద్య మందు తీపి కలదు
' మధుర కవనమందు ' మధు సూదనా! మీకు
మీరె సాటి , పద్య మింపు గూర్చె .
----- సృజన-సృజన
పద్యమును బఠించి పరవశించియుఁ దాను
తొలగించండిపద్యమందె నాకు సద్యశమును
మిక్కిలిగను గూర్చు లక్కాకుల విశిష్ట
గుణున కేను నేఁడు గూర్తుఁ బ్రణతి!