కవి పండిత సాహితీ మిత్రులకు, బ్లాగు వీక్షకులకు
మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!
తేది: జూన్ 26, 2012 నాటి శంకరాభరణంలోని
పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు
భారతయుద్ధమందుఁ గురువర్యుఁడు భీష్ముఁడు నేలఁగూల, దు
ర్వారనిషంగుఁ డర్జునుఁడు వచ్చి, పితామహుఁ డంపశయ్యనుం
గోరఁగ, నేర్పరించి, తన కోరిన గంగ జలమ్ము నిచ్చెఁ, గం
సారియు, ధర్మజుండు, ననిలాత్మజుఁడున్, గవలెల్ల మెచ్చఁగన్!
మధుర కవనమున్ మెత్తును మరల మరల
రిప్లయితొలగించండిధన్యవాదాలు మిస్సన్న మాన్యచరిత!
రిప్లయితొలగించండి