అన్నము - కూర - పప్పు - చారు
పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన కందపద్యం
(దుర్యోధనునకుఁ దమ్ముఁడైన వికర్ణుఁడు హితము బోధించు సందర్భము)
"అన్న! ముకుందుని మాటలు
విన్నను సమకూరఁజేయుఁ బేరును సిరులున్!
బన్నపు తలఁ పప్పు డెపుడొ
యున్నను, విడి, చారుమతికి నున్నతి నిడుమా!!"
మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం అద్భుతంగా ఉంది. అన్యార్థంలో దత్తపదాలను వినియోగించడంలో మీకు మీరే సాటి. అభినందనలు.
ధన్యవాదాలు శంకరయ్యగారూ! బ్లాగును దర్శించి, పఠించి, యభిప్రాయం తెలిపినందులకు కృతజ్ఞుడను.
రిప్లయితొలగించండిస్వస్తి.
రిప్లయితొలగించండిగుండువారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది.
నేను కూడా మంచి కవిత్వం వ్రాయగలిగితే బాగుంటుంది. అప్పుడు శంకరయ్యగారి వంటి కవిమిత్రులు నా బ్లాగులు కూడా దర్శిస్తారేమో కదా.
మీరు అన్యథా భావించకపోతే ఒక చిన్న సూచన. ఏదైనా ఒక మంచి కృతిని నిర్మించటంపై దృష్టిసారించండి.
అన్నము,కూర,పప్పు,చారు లతో సుయోధనునికి తమ్ముని హితబోధ .... బాగుందండి మీ పద్యం.
రిప్లయితొలగించండి>మీ మెప్పునందినందులకు ధన్యుడను శ్యామలరావుగారూ!
రిప్లయితొలగించండితప్పకుండా. మీరు చెప్పిన విషయంపై ఆలోచిస్తాను. కార్యరూపంలో పెట్టడానికి తప్పక ప్రయత్నిస్తాను. స్వస్తి.
>ధన్యవాదాలు కొండలరావుగారూ! ఇలాగే మీలాంటి పెద్దలు నా బ్లాగునకు వచ్చి నాకు తగిన విధంగా ప్రోత్సాహాం ఇవ్వాలని మనవి. స్వస్తి.
స్పందించి వ్యాఖ్యలు పెట్టిన మిత్రులకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండి