తేది: జూలై 11, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము
సుగంధి వృత్తము:
"ఖేద మంది యున్న వారి కేను ది" క్కటంచు నా
మోద మంది తేర్చు విష్ణుమూర్తి భక్తుఁ డైన ప్ర
హ్లాదుచేఁ బఠింప, రాక్షసాధిపుండునౌ నస
ద్వాది, తండ్రి, నేర్పు విద్య తప్పు గాదె సోదరా!
"ఖేద మంది యున్న వారి కేను ది" క్కటంచు నా
మోద మంది తేర్చు విష్ణుమూర్తి భక్తుఁ డైన ప్ర
హ్లాదుచేఁ బఠింప, రాక్షసాధిపుండునౌ నస
ద్వాది, తండ్రి, నేర్పు విద్య తప్పు గాదె సోదరా!
రిప్లయితొలగించండితల్లి కన్న గొప్ప దైవ మేదియు లేదు
గురువు మెప్పు కన్న గొప్ప లేదు
తండ్రి నేర్పు విద్య తప్పు గాదెన్నడు
తెలుగు కన్న తీపు పలుకు లేదు
చక్కని పూరణ అందించారు వెంకటరాజారావుగారూ! అభినందనలు!
తొలగించండి