శంకరాభరణంలో నేఁటి (20.06.2019) సమస్య:
స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా
నా పూరణము:
[ఒకఁడు తన మిత్రునితో నొక సుందరినిఁ జూచితినని వచించిన సందర్భము]
"ఘనతర నాట్యభంగిమము కమ్రవిలాస సువర్ణహాస వ
ర్తనము స్వరూపమో వినుత రమ్య విశిష్ట ప్రహృష్ట దీప్త మా
మనమున సంతసమ్ము విసుమానము కన్నులఁ గంఠమందు గో
స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా!"
(గోస్తనము=నలువది పేటలు గల ముత్యాల హారము)
స్వస్తి
sundari..prasthavana..lede..
రిప్లయితొలగించండిచాన=స్త్రీ=సుందరి కాదా! పద్యంలో అంతయు సుందరీ ప్రస్తావనయే గదా! స్పందించినందుకు ధన్యవాదాలండీ Unknown గారూ!
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచిత్రము వృత్తము ఒక దానికొకటి పోటీ "పడుచు" న్నాయి :)
జిలేబి
మీ అభిమానపూర్వక స్పందనకుఁ గడుంగడు కృతజ్ఞుఁడనండీ జిలేబీగారూ!
రిప్లయితొలగించండిఘన జఘనంపు భారమున , కాళ్ళు వడంక నొకింత , గొంతు కూ
రిప్లయితొలగించండిర్చుని , యొక చేత గోవు నలు రొమ్ములపై జలధార చల్లి , పా
లను ఘనపాత్రలో పితుకు లాఘవ మొప్పెడు నాతి చేతిలో
స్తనములు నాల్గు గల్గు నొక చానను గాంచితినయ్య మిత్రమా .
మాన్యులు లక్కాకుల వారికి నమస్సులు! అద్భుతమైన భావన! కాని, చేత గోవు నలు రొమ్ములు, చేతిలో స్తనములు నాల్గు...అను పదములు పునరావృత్తి కావచ్చునా అని అనుమానము!
రిప్లయితొలగించండిఆర్యా!
తొలగించండిఘన జఘనంపు భారమున , కాళ్ళు వడంక నొకింత , గొంతు కూ
ర్చుని , యట నల్లగోవు నలు రొమ్ములపై జలధార చల్లి , పా
లను ఘనపాత్రలో పితుకు [లాఘవ మొప్పుఁ గరద్వయంబునన్/లాఘవ మొప్పెడునట్టి చేతిలో]
స్తనములు నాల్గు గల్గు నొక చానను గాంచితినయ్య మిత్రమా!
అని సవరించినచో...ఎలా వుంటుందండీ...
(సవరణలు మైలవరపువారు, సూరంవారు, కందివారు ముగ్గురివీనూ...)
మధుసూదన్ గారూ ,
రిప్లయితొలగించండిముందుగా మీకు ధన్యవాదములు ,
ఉద్దండులచేత సవరణలు చేయించి పూరణకు వన్నెతెచ్చారు . వారందరకూ నమశ్శతాలు .
అంతా మీవంటి పెద్దల ఆశీర్వాదబలమేనండీ! నమస్సులు!
రిప్లయితొలగించండిసవరణలు సూచించిన పెద్దలకు ధన్యవాదములు!
రిప్లయితొలగించండిమధుసూదన్ గారు. మీరు వ్రాసే పద్యాలు చాలా మధురంగా ఉంటాయి. అయితే ఈ రకమైన ఆశీల జుగుప్స సమస్యలకు పద్యాలు వ్రాయవద్దు అని వినతి.
రిప్లయితొలగించండిదయచేసి పాండిత్యాన్ని ఇలాంటి నీచమైన స్త్రీ శరీర అంగాలను స్ఫూరింపజేసే రచనలకు ఉపయోగించ వద్దు. పై పెచ్చు ఆ బొమ్మ ప్రచురించడం సరికాదు.
సమస్యలంటేనే ఇలా వుంటాయండీ! జుగుప్స కలిగించేలాగానే స్ఫురిస్తాయి. కవి తన ప్రతిభ చేత ఆ అశ్లీలతను దూరంచేసి, పఠితలకు అమందానందాన్ని కలిగిస్తాడు.
తొలగించండిస్పందించి, వ్యాఖ్య పెట్టినందులకు ధన్యవాదములు!