శంకరాభరణంలో నేఁటి (22.06.2019) సమస్య:
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో
నా పూరణము:
[కలరవ కూజితములఁ బోలు నాహ్లాదకరమైన చక్కని కైతలను జెప్పి యనేక బహుమానములను గెలుచుకొని మరలివచ్చు నొక కవివర్యుఁ డడవి దారి నడుమ నొక యడవిపంది యెదురురాఁగాఁ గలవరపడిన సందర్భము]
కలరవకూజితాంచితసుగంధరసాలకిసాలఖాదనన్
బెలుౘనయైనరాగరుచిపెంపునుఁ బోలిన కైత సెప్పి తాఁ
బలు బహుమానముల్ గొని నివర్తిలి వౘ్చుౘుఁ గాన నొక్క యే
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!
(ఏకలము=అడవిపంది)
స్వస్తి
ఇలు సనినంత నొంటిపయి నింతికి చాలిన చీర లేదు , ఆ
రిప్లయితొలగించండికలి పులి పిల్లలన్ దినెడు , కాళ్ళకు బల్పము గట్టి తిర్వినా ,
పలుకదు లచ్చి , శారదకు భద్రమె , యట్టి తరిన్ , భలేగ , రూ
కల , మును గాంచి , నంత , గలగంబడె , సత్కవి వర్యు డయ్యయో .
చక్కని పూరణ నందించారండీ లక్కాకులవారూ! శుభాభినందనలు!
తొలగించండి