Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 25, 2019

చెఱసాలే సౌఖ్యకరము!

సంబంధిత చిత్రం

శంకరాభరణంలో నేఁటి (25-06-2019) సమస్య:
కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్

నా పూరణము:

[మధురానగరానికి వెడలి, తిరిగిరాని శ్రీకృష్ణునికై వేచి వేచి యొక గోపిక విరహంతో పలవరించు సందర్భము]

"రారా నా మొర నాలకించి! యిఁక నన్ రక్షించి, నీ కౌఁగిలిన్
జేరం జేసియు, సౌఖ్యమిమ్ము హరి! నా జీవమ్ము నీవే కదా!
మారా, నా పరమాత్మ వీవె, సుర సమ్మాన్యా! ప్రియాశ్లేష మన్
గారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్?"


స్వస్తి


4 కామెంట్‌లు:

  1. నే రాను హనీ మూనుకు
    తీరిక గలదేమి తిరుగ , తిరు కౌగిలులన్
    పోరాట విడిచి , మదనా
    కారా ! గృహ సుఖము దక్కగలదే బయటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. పోరీ ! వినవే! రావే
      కారప్పూసలు, జిలేబి, కందపు బజ్జీల్
      ప్రేరణ గావింప నెలతు
      కా! రా ! గృహ సుఖము దక్కగలదే, బయటన్! :)


      జిలేబి

      తొలగించండి
    2. లక్కాకులవారూ! మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి