తేది: సెప్టెంబర్ 21, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన దత్తపద్యారంభము "మనసిజ పుష్పబాణములు మాటికిఁ గ్రుచ్చఁగ..." నను వాక్యమునకు నేను చేసిన పూరణము
మనసిజ పుష్పబాణములు మాటికిఁ గ్రుచ్చఁగ మన్మథార్తయై
తనువు ప్రతాపనమ్ముఁగొనఁ దద్దయుఁ దాళఁగలేక తారయే
చని తుహినాంశు మ్రోలఁ దన స్వాంత గతస్థ మనోరథమ్ముఁ దీ
ర్పను బిడియమ్మువీడి వెస రమ్మనెఁ దేల్పఁగ రాసకేళికిన్!
తనువు ప్రతాపనమ్ముఁగొనఁ దద్దయుఁ దాళఁగలేక తారయే
చని తుహినాంశు మ్రోలఁ దన స్వాంత గతస్థ మనోరథమ్ముఁ దీ
ర్పను బిడియమ్మువీడి వెస రమ్మనెఁ దేల్పఁగ రాసకేళికిన్!
నమస్తే మధుసూదన్ గారు..ఈ పద్యంలో రెండవ పాదం లోనే నేను అవగతం అవ్వక ఆగిపోయాను. గట్టి పదాలు బాగానే వాడారు (దద్దయు,తారయే చని, మ్రోలఁ దన స్వాంత గతస్థ)..అయితే నా మనో ఉల్లాసము కొరకు కొంచెం వివరణ ఇవ్వగలరని ప్రార్ధన
రిప్లయితొలగించండిమనసిజ పుష్పబాణములు=(మన్మథునియొక్క) పూల బాణాలు;
రిప్లయితొలగించండిమాటికిఁ గ్రుచ్చఁగ=(తనకు) మళ్ళీ మళ్ళీ గ్రుచ్చుకొంటుండగా;
మన్మథార్తయై=మదన తాప పీడితయై
తనువు=శరీరము
ప్రతాపనమ్ముఁగొనన్=వేడెక్కగా
తద్దయున్=ఆ తాపాధిక్యతను (ఎంతమాత్రమును)
తాళఁగలేక=ఓర్చుకొనలేక
తారయే=బృహస్పతి భార్యయైన ఆ తారయే
చని=వెళ్ళి
తుహినాంశు మ్రోలన్=చంద్రుని ముందర
తన=తనయొక్క
స్వాంత గతస్థ=మనస్సులోనున్న
మనోరథమ్మున్=కోరికను
తీర్పను=తీర్చుటకై
బిడియమ్మువీడి=సిగ్గును విడిచిపెట్టి
తేల్పఁగ రాసకేళికిన్=రతిక్రీడలో తనను సుఖపెట్టడానికి
వెస రమ్మనెన్=వెంటనే రమ్మనెను!
తధ్ధయున్ = ఎంత మాత్రమున = ఆ తాపాధిక్యత ..ఇది ఎలా అయ్యింది
తొలగించండినా అజ్ఞానాన్ని మన్నించాలి :D
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిwhy??
తొలగించండివంశీకృష్ణ గారూ! తద్ద యను పదమునకు అప్యర్థకము (ను, యును) చేర్చగా తద్దయు అను పదమేర్పడినది. ఇది యాధిక్యతను తెలిపే పదము. అందుకని నేను దీనికి ఆధిక్యతనే తెలుపుచు...ఏ యాధిక్యత? యని ప్రశ్నించుకొని, తాపాధిక్యత యను అర్థమును ఇచ్చాను. బ్రాకెట్టులో ఉన్న ’ఎంతమాత్రమును’ అనేది అధ్యాహారము/ప్రాసంగికము. అది అర్థమునకు ఉపబలకము. సందర్భమును బట్టి అవగతముచేసుకొనవలసిన పదము.
రిప్లయితొలగించండి****
శ్యామలరావుగారూ మీరేదో తెలుపాలనుకొని విరమించుకొన్నారు. నిరభ్యంతరముగా తెలుపగలరు. నేను పద్యము వ్రాయునపుడు నా మదిలో మెదలిన పదముల పోహళింపు ననుసరించియే నేను వ్రాసితిని. ఏమైన ప్రమాదపతితములు కావచ్చును. తెలుపగలరు. మీరు నా బ్లాగులోనికి రావడమే సంతోషదాయకము. కృతజ్ఞతలు.
****
స్వస్తి.
మిత్రులు మధుసూదన్ గారూ, మీ పద్యం మంచి పాకంతో చక్కగా ఉంది, ఈ వాక్యమే వ్రాసి వ్యాఖ్యగా ఉంచాను కాని మధ్యలో - రెండుపడవల్లో కాళ్ళు పెట్టినవాడిలాగా పనిచేస్తూ చదివి బాగుందన్నాను కదా - ఆవలి పనికి సంబంధించిన విండోలో టైప్ చేయవలసిన కమాండ్స్ వగైరా ఇందులోపడి పోయాయి. హడావుడిలో చూసుకోలేదు మొదట. వెంటనే గమనించి వ్యాఖ్య తొలగించాను కాని ఆ రోజంతా పనిలో బిజీగా ఉండి మళ్ళా మీబ్లాగులోకి రావటం వీలు కాలేదు. అంతకంటే మరేమీ లేదు.
తొలగించండిఎలాగూ వచ్చాను కదా, ఒక మాట, శ్యామలీయంబ్లాగులో విశేషవృత్తాల్లో పాహిరామప్రభభోశీర్షికన వచ్చేపద్యాల కోసం ప్రత్యేకంగా ఒక tab పెట్టాను. ఇలాగు చాలానే విశేషవృత్తాలు వస్తాయి కాబట్టి ఇలాంటి సూచిక నాకూ, ఇతర కవిమిత్రులకూ, ఔత్సాహిక పాఠకులకూఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. వీలువెంబడి దానిని పరిశీలించండి.
సంతోషం. తప్పక చూస్తాను.
తొలగించండి