Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 22, 2019

కలమును గని కలవరపడిన కవివర్యుఁడు



శంకరాభరణంలో నేఁటి (22.06.2019) సమస్య:
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో

నా పూరణము:

[కలరవ కూజితములఁ బోలు నాహ్లాదకరమైన చక్కని కైతలను జెప్పి యనేక బహుమానములను గెలుచుకొని మరలివచ్చు నొక కవివర్యుఁ డడవి దారి నడుమ నొక యడవిపంది యెదురురాఁగాఁ గలవరపడిన సందర్భము]

కలరవకూజితాంచితసుగంధరసాలకిసాలఖాదనన్
బెలుౘనయైనరాగరుచిపెంపునుఁ బోలిన కైత సెప్పి తాఁ
బలు బహుమానముల్ గొని నివర్తిలి వౘ్చుౘుఁ గాన నొక్క యే
కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!

(ఏకలము=అడవిపంది)

స్వస్తి


2 కామెంట్‌లు:

  1. ఇలు సనినంత నొంటిపయి నింతికి చాలిన చీర లేదు , ఆ
    కలి పులి పిల్లలన్ దినెడు , కాళ్ళకు బల్పము గట్టి తిర్వినా ,
    పలుకదు లచ్చి , శారదకు భద్రమె , యట్టి తరిన్ , భలేగ , రూ
    కల , మును గాంచి , నంత , గలగంబడె , సత్కవి వర్యు డయ్యయో .

    రిప్లయితొలగించండి