తేది: మే 29, 2013 నాటి శంకరాభరణంలో దత్తపది శీర్షికన "తమ్ములు" శబ్దాన్ని ప్రతి పాదాదిలో నిల్పుతూ భారతార్థంలో కందపద్యాన్ని కాని, ఉత్పలమాలను కాని వ్రాయమనగా నేను రాసిన కందపద్యం...
సంధికై దూతగఁ బంపుచు ధర్మరాజు కృష్ణునితోఁ బలికిన మాటలు-
"తమ్ములు కౌరవులను, జే
తమ్ములు సంధిని వరించు దారి నడిపి, పం
తమ్ములు వీడెడు, సంగా
తమ్ములు పెనుపొందు నుడులఁ దనుపుము కృష్ణా!"
"తమ్ములు కౌరవులను, జే
తమ్ములు సంధిని వరించు దారి నడిపి, పం
తమ్ములు వీడెడు, సంగా
తమ్ములు పెనుపొందు నుడులఁ దనుపుము కృష్ణా!"
‘తమ్ములు’ శబ్దాన్ని నాలుగుపాదాల్లోనూ అర్థబాహుళ్యంతో ప్రయోగించిన మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండిరోజు రోజుకూ మీ బ్లాగు సర్వాంగసుందరంగా రూపు దిద్దుకుంటున్నందుకు సంతోషం!
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
తొలగించండిఅద్భుతంగా రాశారు పద్యం.
రిప్లయితొలగించండిధన్యవాదాలు మల్లికార్జునస్వామిగారూ!
తొలగించండి