తేది: సెప్టెంబర్ 16, 2012 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన...అల్లము - చింతపండు - కోతిమీర - జీర...అనే పదాలను ఉపయోగిస్తూ, మీకు నచ్చిన ఛందస్సులో, భారతార్థంలో... పద్యం వ్రాయమనగా...నేను రాసిన "తేటగీతి" పద్యం...
(కర్ణ జనన సమయాన కుంతీ, భాస్కరుల సంభాషణము)
సూర్యుఁడు:
"అల్ల మునిచంద్రు వరమునఁ బిల్లవాఁడు
ప్రభవ మందె! వలదు చింత! పండుగ యిదె!"
కుంతి:
"కోరి మంతుఁ జదువ నేను కోతి! మీర
రవియగా! నేను జీరఁగ , రాఁ దగు నొకొ?"
అద్భుతమైన పూరణ యిది. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
తొలగించండి