Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, అక్టోబర్ 08, 2013

అఱవమునందు వేమన మహాకవి భాగవతమ్ముఁ జెప్పెఁగా

తేది:28-05-2012 నాటి శంకరాభరణంలో నేను పూరించిన సమస్య:
(క్రమాలంకారాన్ని ఆశ్రయించి పూరించటం జరిగింది)

అఱవలు నెందుఁ బల్కెదరొ? యాటవెలందుల యోగి యెవ్వఁడో?
కఱగఁగఁ జేయు మానసముఁ గావ్యముచే నతఁ డెవ్వఁడో కదా?
వఱలెడు భక్తితోడుతను బమ్మెర పోతన యేమి సెప్పెనో?
యఱవమునందు; వేమన; మహాకవి; భాగవతమ్ముఁ జెప్పెఁగా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి