Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఆగస్టు 18, 2014

నిషిద్ధాక్షరి: ’ర’కారం వాడకుండా, శివధనుర్భంగ వర్ణన, నచ్చిన ఛందస్సులో

తేది: ఆగస్టు 17, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన ’ర’కారం వాడకుండా, నచ్చిన ఛందస్సులో, శివధనుర్భంగ వర్ణన చేయమనగా, నేను రాసిన తేటగీతి



తునిమి తాటకం, దాపసితోడఁ జనియు,
జనక జనపాలు సభను భస్మాంగు ధనువు
భంజనము సేసి, నయనోత్సవమ్ము సభకొ
సంగి, సీతఁ జేపట్టెఁ గౌసల్యపట్టి!

3 కామెంట్‌లు:

  1. గుండువారు, మీకు తెలియదని కాదు. ప్రస్తావించటం సందర్భోచితమో నా బలహీనతో కాని ప్రస్తావన చేస్తున్నాను. సంస్కృతఛందస్సులైన వృత్తాలలో తప్ప పాదోల్లంఘనం అంత కళగా ఉండదు. వీలైనంతవరకూ పరిహరించండి. ఏ పాదాని కాపాదం విరిగితేనే వీటిలో సొగసు. గణారంభాలు పదారంభాలైతే మరింత సొగసు. కేవలం నా అభిప్రాయం చెప్పటం అంతే. పెద్దపెద్ద కవులంతా కూడా ఇటువంటి వేమీ పాటించకుండా వ్రాసిన విషయం తెలిసినదే అందరకూ. అది వేరే సంగతి.

    రిప్లయితొలగించండి
  2. సమస్యాపూరణ సందర్భాల్లో పాదోల్లంఘనం ఆహ్వానించ దగ్గదే. పద్యపు సొగసు కంటే, పూరణ పరిపూర్ణతకు ప్రాధాన్యమివ్వడం సముచితమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణపద్యాలు అందంగా ఉండనక్కరలే దనుకోవటం కేవలం పొరపాటు అభిప్రాయం. పూరణపద్యాలైనా అందగించినవే రాణిస్తాయి కాని తదన్యం కాదు. ఇటువంటి విషయాలు పరస్పరం గుర్తుచేసుకోవటం ఎవరినీ ఎవరూ కించపరచుకోవటం కాదండి.

      పద్యంపు సొగసు కంటెను
      హృద్యంబగు నట్టి దొక్క డెట్లుండునయా
      పద్యంబును కిట్టించుట
      విద్యాలక్షణము గాదు వేసటబడుటే!

      తొలగించండి