తేది: ఆగస్టు 23, 2014 నాటి శంకరాభరణంలో
క్రొత్తగా ప్రారంభించిన న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- సరస్వతీ స్తుతి
ఛందస్సు- తేటగీతి
మొదటిపాదం-మొదటి అక్షరం ‘స’,
రెండవ పాదం-మూడవ అక్షరం ‘ర’,
మూడవ పాదం-తొమ్మిదవ అక్షరం ‘స్వ’,
నాలుగవ పాదం-పన్నెండవ అక్షరం ‘తి’
దీనికి నా పూరణము:
సకల విద్యాప్రదాత్రి! విశాలనేత్రి!
భ్రమరనీలవేణి స్వచ్ఛవర్ణధాత్రి!
బ్రహ్మమానస సత్పుత్రి! స్వర సుగాత్రి!
బ్రాహ్మి! భగవతి! వరద! భారతి నమోఽస్తు!
-:స్వస్తి:-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి