తేది: ఆగస్టు 14, 2014 నాటి శంకరాభరణంలోని
దత్తపది శీర్షికన
కలి-పులి-బలి-వెలి పదములనుపయోగించి
ఇష్టం వచ్చిన ఛందస్సులో
వెన్నెలరేయిని వర్ణించమనగా
నేను రాసిన తేటగీతి
కలిమి లేములు కలిగిన గగనగామి
పులిన తటముల వెన్నెల వెలుఁగుఁ బఱుప,
బలిమినిం బ్రేమికుల కాంక్ష వడిగఁ బెకలి,
వెలికివచ్చెను బరిణయాభీప్సితమయి!
అద్భుతమైన పూరణ. దత్త పదాలను స్వార్థంలో ఉపయోగించకుండా పాదాదిని ప్రయోగించడం కష్టమే. దానిని మీరు సాధించారు. సంతోషం. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి