తేది: మే 29, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు
(ఒక పిచ్చివాని మాటలు)
"నభము నెక్కి వేగ నావ ప్రయాణించె;
నీటిలోన రైలు నిగిడి సాగె;
నేలపైన చేప లీలగాఁ బరువెత్తె;
బండపైన జొన్నపైరు పండె!" (1)
"పిచ్చి కుదిరెఁ దలకు వేగమే రోఁకలిం
జుట్టుఁ డయ్య మీరు చోద్యముగను!
బండపైన జొన్నపైరు పండెను; కోసి
వంట వండిపెట్టనుంటి మీకు!!" (2)
రెండు పూరణములు చాలా చక్కగా వున్నాయి. రెండవది మరీను.
రిప్లయితొలగించండిరెండు పూరణములు చాలా చక్కగా వున్నాయి. రెండవది మరీను.
రిప్లయితొలగించండిధన్యవాదాలు వేణుగోపాల్ గారూ!
రిప్లయితొలగించండిచక్కని పూరణలు... అభినందనలు.
రిప్లయితొలగించండి(నా క్రొత్త సెల్ ఫోన్ ద్వారా)