(మయసభయందు సుయోధనుండు భంగపడి, పరితపించిన సందర్భము)
ఉత్పలమాలిక:
“ఏలిక కిద్ది వింతె, భళి! యిట్టి సరోజము చిత్రమే సుమా!
చాల కుతూహలమ్ము మన సంతయుఁ గ్రమ్మె” నటంచు శీఘ్రమే
కాలిని నేలపై నిడియుఁ, గ్రక్కునఁ గూపమునందుఁ గూలఁగన్,
దాలిమి లేని చేటి, కని, దబ్బున నవ్వె! సుయోధనుండు “నే
నేలొకొ యా సభన్ గనఁగ నేగితి? నేగితిఁ బో, సరోజ మే
నేలఁ బరీక్ష సేయవలె? నేలొకొ కూపమునందుఁ గూలితిన్?
గూలితిఁ బొమ్ము, ద్రోవదియె గొబ్బున నవ్వె! సహింపఁజాల! నే
నేల సహింపఁగావలెను? నిశ్చయ మిద్దియె, చచ్చె దే నిఁకన్!
జాలు! మనంగ నున్నఁ, దగు చర్యను దానిఁ బరాభవింతు! నా
కాలికి ముల్లు గ్రుచ్చినది! కావలె గొడ్డలి, దానిఁ దీయఁగన్!!”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి