అసి - కసి - నుసి - మసి
పదాలను ఉపయోగిస్తూ
కార్తిక పూర్ణిమను గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన కందపద్యం
కం.
అసియాడు మేఘములఁ గని
కసిమసఁగుచుఁ జంద్రుఁ డెలమిఁ గార్తికమునఁ దా
ను సిగపువయి హరుని దయను
మసిచేసెను జీఁకటులను మహిఁ బౌర్ణమినిన్!
పడుకొనడానికి పోతూ మనోహరమైన మీ పద్యం చదివాను. ఇక ఈ రాత్రి నాకు శుభరాత్రే... ధన్యవాదాలు...
రిప్లయితొలగించండిఅన్నట్టు రేపు నేను విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నా.
స్పందించినందుకు ధన్యవాదాలు శంకరయ్యగారూ! ఆలస్యమునకు మన్నించండి.
రిప్లయితొలగించండి