తేది: నవంబర్ 04, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:
("ఈ నవయౌవనంపు హేమంతమ్మునను నాకుఁ బెండ్లి యింకనుం గాలేదు గదా!"యని యొక యువకుఁడు తపించుచున్న సందర్భము)
ఇరువదొక్కేఁడు నేగె! నభీప్సితమ్ముఁ
దీరదాయె! నా పెండ్లి కా దింత దాఁక!
రేఁగె మదిఁ గోర్కె! యీ పంచ త్రింశతియు న
వార్ధకమ్మునఁ గావలెఁ బడుచు భార్య!
(పంచత్రింశతియు-నవ = 35 + 9 = 44 ఏండ్లు;
అర్ధకమ్మున = సగము వయస్సున = 44 ఏండ్లలో సగము = 22 ఏండ్ల వయస్సున)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి