తేది: అక్టోబర్ 26, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన శ్రీరామ పట్టాభిషేకాన్ని వర్ణిస్తూ తేటగీతి పద్యంలో
మొదటిపాదాన్ని ‘రా’తో ప్రారంభించాలి...రెండవ అక్షరంగా ‘మ’ నిషిద్ధం
రెండవపాదాన్ని ‘భ’తో ప్రారంభించాలి...రెండవ అక్షరంగా ‘ర’ నిషిద్ధం
మూడవపాదాన్ని ‘ల’తో ప్రారంభించాలి...రెండవ అక్షరంగా ‘క్ష్మ’ నిషిద్ధం
నాలుగవపాదాన్ని ‘శ’తో ప్రారంభించాలి...రెండవ అక్షరంగా ‘త్రు’ నిషిద్ధం
నిషిద్ధాక్షరాలు కేవలం పాదంలో రెండవస్థానానికే పరిమితం. పద్యంలో మిగిలిన స్థానాలలో వాడవచ్చుననగా
నేను రాసిన తేటగీతి పద్యము:
రాజసింహాసనమున శ్రీరామునపుడు
భక్తి భరతుండు పట్టాభిషిక్తుఁ జేసి,
లలిత మర్యాదు లక్ష్మణు నలరఁ జేసి,
శస్త్రి శత్రుఘ్ను నానంద సదనుఁ జేసె!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి