తేది: మే 13, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
ఇలయు వ్రయ్యలైన, హిమశైలమదరిన,
సూర్యచంద్రులు రహి సోలి చనిన,
గాలి పెచ్చరిలిన, కడలియే యింకిన
మాటఁ దప్పువారె మానధనులు?
*** *** ***
భావం:భూమి ముక్కలైనా, హిమాలయం కంపించినా, సూర్యచంద్రులు కాంతిని పోగొట్టుకున్నా, సుడిగాలులు ఉవ్వెత్తున విజృంభించినా, సముద్రాలు ఇంకినా (ఇవి అన్నీ జరుగనే జరుగవు...ఒకవేళ జరిగినా) కానీ మానధనులు మాత్రం ఇచ్చిన మాటను తప్పుతారా? తప్పరు గాక తప్పరు...అని భావం! అంటే జరుగనివన్నీ జరుగుతాయేమో గానీ, మానధనులు మాత్రం ఇచ్చిన మాటతప్పరు...అని భావం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి