అంశం- గ్రీష్మతాపము
ఛందస్సు- ఆటవెలఁది
నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా
‘వ - డ - గా - లి’ ఉండవలెననగా
నేను వ్రాసిన పద్యము
ఎండకాయుచుండె నింత వేఁడిమిని వ
హించి సూర్యుఁ డిట్లు హింసల నిడఁ
బగటిపూట జనులు బయటకురారుగా
యింటనుండునట్టి యిచ్చఁ దేలి!!
‘వడగాలి’ని చక్కగా ఇమిడ్చిన న్యస్తాక్షరి... చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి