ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
చంపకమాల:
వరజవమొప్పఁగా బలియె వాసవు స్వర్గముఁ బాప, నీవ స
త్వరితముగా నటన్, నిలిచి వామనమూర్తిగ, నేలఁ గోరి, యీ
వరి భువిఁ ద్ర్యంఘ్రినే యిడఁగ, స్వర్భువనాక్రమి! యీవు, మోపవో
శిరముపయిన్! గడున్ నతులు! శ్రీశ! త్రివిక్రమ! నంద! కేశవా! 9
గర్భిత కందము:
జవమొప్పఁగా బలియె వా
సవు స్వర్గముఁ బాప, నీవ సత్వరితముగా
భువిఁ ద్ర్యంఘ్రినే యిడఁగ, స్వ
ర్భువనాక్రమి! యీవు, మోపవో శిరముపయిన్! 9
గర్భిత తేటగీతి:
బలియె వాసవు స్వర్గముఁ బాప, నీవ
నిలిచి వామనమూర్తిగ, నేలఁ గోరి,
యిడఁగ, స్వర్భువనాక్రమి! యీవు, మోప!
నతులు! శ్రీశ! త్రివిక్రమ! నంద! కేశ! 9
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
మీ కవన వనసాగరమున విహారం మమ్ము రస సాగరమున ఓలలాడించే ఆచార్య. గుండు హనుమండ్లు Teacher SA English
రిప్లయితొలగించండిచాలా సంతోషమండీ! మీ ప్రోత్సాహకపు మెప్పునకు కృతజ్ఞుడను!
తొలగించండి