Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 10, 2021

శివస్తుతి [గర్భకవిత్వము]

మిత్రులందఱకు నమస్సులు! 

శివస్తుతి

[గర్భకవిత్వము]



ద్రుతవిలంబిత, కంద, గీత, స్వాగత గర్భ చంపకమాల

చంపకమాల:
పురహర! పూజితా! పశువిభూ! సురవంద్య! భవాభవాఖ్య! శూ
ర రణ వరా! జటీ! శశిధరా! పురశాస్త! ప్రశస్తకాఢ్య! క
ర్వరి వర! భ్రాజితా! వృషధవా! స్థిర వేష! పవిత్ర కార్య! చి
త్పురుష! ప్రభూ! జపా! విశద! భూతనృపేంద్ర! పవిత్రపాలకా!

పై చంపకమాలలో దాఁగియున్న యితర పద్యము లీ దిగువ నీయఁబడినవి:

1. ద్రుతవిలంబితము:
పశువిభూ! సురవంద్య! భవాభవా!
శశిధరా! పురశాస్త! ప్రశస్తకా!
వృషధవా! స్థిర వేష! పవిత్రకా!
విశద! భూతనృపేంద్ర! పవిత్రపా!
[న భ భ ర, 1-7లకు యతిమైత్రి]

2. కందము:
హర! పూజితా! పశువిభూ!
సుర వంద్య! భవాభవాఖ్య! శూర రణ వరా!
వర! భ్రాజితా! వృషధవా!
స్థిర వేష! పవిత్ర కార్య! చిత్పురుష! ప్రభూ!

3. తేటగీతి:
పశువిభూ! సురవంద్య! భవాభవాఖ్య!
శశిధరా! పురశాస్త! ప్రశస్తకాఢ్య!
వృషధవా! స్థిర వేష! పవిత్ర కార్య!
విశద! భూతనృపేంద్ర! పవిత్రపాల!

4. స్వాగత వృత్తము:
పూజితా! పశువిభూ! సురవంద్యా!
రాజ! హే! శశిధరా! పురశాస్తా!
భ్రాజితా! వృషధవా! స్థిర వేషా!
భూ జపా! విశద! భూతనృపేంద్రా!
[ర న భ గగ, 1-7లకు యతిమైత్రి]



స్వస్తి

మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



2 కామెంట్‌లు:

  1. అత్యద్భుత మైన ప్రయోగము .. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  2. ఒక పద్యం రాయటానికే తాడు తెగుతున్నది మాలాంటివాళ్లకి!
    మీరు ఒక పద్యంలో అయిదు పద్యాల్ని ఇరికించేశారు - నమస్తే!

    రిప్లయితొలగించండి