ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
చంపకమాల:
కన ఘన దైత్యుఁడౌ పసిఁడికంటి, నివేశిని వార్ధి ముంప, నీ
వును కిటివై ప్రభూ! యసురుఁ బోటునఁ గూలిచి, హర్షమంద భూ
మినిఁ గొని, తాల్చియున్, భువిని మిత్తినిఁ బాపియుఁ బ్రోచినావె! ధీ
ఘన! ప్రణతుల్ హరీ! త్వరనుఁ గావుమ నన్నును తార్క్ష్య! కేశవా! 7
గర్భిత కందము:
ఘన దైత్యుఁడౌ పసిఁడికం
టి, నివేశిని వార్ధి ముంప, నీవును కిటివై,
కొని, తాల్చియున్ భువిని మి
త్తినిఁ బాపియుఁ బ్రోచినావె! ధీ ఘన! ప్రణతుల్! 7
గర్భిత తేటగీతి:
పసిఁడికంటి, నివేశిని వార్ధి ముంప,
నసురుఁ బోటునఁ గూలిచి, హర్షమంద
భువిని మిత్తినిఁ బాపియుఁ బ్రోచినావె!
త్వరనుఁ గావుమ నన్నును తార్క్ష్య! కేశ! 7
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
మీ యీ శతకాన్ని ఆసక్తితో చదువుతున్నాను. మంచి ప్రయత్నం.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ శ్యామలరావుగారూ! మీ ప్రోత్సాహక ప్రశంసలకు కడుంగడు కృతజ్ఞుడను!
తొలగించండి