Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మే 19, 2021

ఎనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనిమిదవ పద్యము:

ఉత్పలమాల:
నీ, దరిలేనిదౌ దయను, నీ వర రూపముఁ దా భజింపఁ, బ్ర
హ్లాదుఁ డటన్; గటా! కృప సెడం గశిపుం డెదఁ గిన్కఁబూని, చ
క్రీ! ధరఁ దండ్రియే, వెతలుఁ గీ ళ్ళిరవం దిడ, వే నృసింహ! త్రెం
తే, దనుజున్! సుతున్, నతి హృదిం గొని, కాచితె; నంద! కేశవా! 8

గర్భిత కందము:
దరిలేనిదౌ దయను, నీ
వర రూపముఁ దా భజింపఁ, బ్రహ్లాదుఁ డటన్!
ధరఁ దండ్రియే, వెతలుఁ గీ
ళ్ళిరవం దిడ, వే నృసింహ! త్రెంతే, దనుజున్! 8

గర్భిత తేటగీతి:
దయను నీ వర రూపముఁ దా భజింపఁ;
గృప సెడం గశిపుం డెదఁ గిన్కఁబూని,
వెతలుఁ గీ ళ్ళిరవం దిడ, వే నృసింహ!
నతి హృదిం గొని, కాచితె; నంద! కేశ! 8



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


2 కామెంట్‌లు:

  1. వెనుకటి పద్యాలతో‌ పోల్చితే ఇది కొంచెం ధారాశుధ్ధిగా వచ్చినట్లు అనిపిస్తున్నదండీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రోత్సాహక రూపమైన మీ మెచ్చుకోలునకు మనఃపూర్వక కృతజ్ఞతలండీ శ్యామలరావుగారూ! ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ పద్యాన్ని ధారాశుద్ధితో నడపడం కత్తిమీద సామేనండీ! ధన్యవాదములు!

      తొలగించండి