💐💐💐💐💐💐💐💐
శ్రీ వికారి నామాంకిత స్థిర యుగాది
సర్వులకు శుభములఁ గూర్చి, శాంతిఁ బంచి,
జీవితములందు వెలుఁగుల సిరుల నిచ్చి,
తీర్చుఁ గావుతఁ గోర్కెల దినదినమ్ము!
సిరులనుఁ బంచి, యెప్పుడును [శ్రీ]కరమౌ సుగుణాళిఁ జేర్చియున్,
విరుల సువర్షముల్ గురిసి, [వి]శ్రుతమౌ పికరాగ మిచ్చియున్,
గరముల దాతృ కృత్య మిడి, [కా]మితముల్ ముదమార నిచ్చి, చే
ర్చి రసిక హృద్యపద్యము ధ[రి]త్రిని, నేఁటి వికారి వెల్గుతన్!
మధురకవి గుండు మధుసూదన్, ఓరుగల్లు
💐💐💐💐💐💐💐💐
వి]శ్రుతమౌ పికరాగ meaning ?
రిప్లయితొలగించండివిశ్రుతమౌ పికరాగము అనగా...ఎంతో ప్రఖ్యాతి గాంచిన కోకిలల రాగము అని అర్థమండీ నీహారికగారూ! నా యీ కవితను పఠించినందులకు నమస్సుమాంజలులు!
రిప్లయితొలగించండిఎంతో మధురంగా ఉంది ఈ పద్యం మధుసూదన్ గారు.ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిస్పందించినందులకు ధన్యవాదాలండీ నీహారిక గారూ!
రిప్లయితొలగించండి