Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 28, 2021

ఎనుబదితొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదితొమ్మిదవ పద్యము:

చంపకమాల:
ధ్రువ! ఘన! రాఘవా! యలరఁ దోచిన భాగవతాప్తిఁ గోరి, శ్రీ
ధవ! మదిలోఁ, గడుం దడవి, దానిని భక్తియుతమ్ముగాను, నీ
భువిఁ దనరన్, హరీ! పరఁగఁ బోతనచేఁ దగ వ్రాయఁజేసి, దా
న వెలిఁగితే, క్షితిన్ వఱలి, నమ్మికఁ బెంచితె భక్తిఁ గేశవా! 89

గర్భిత కందము:
ఘన! రాఘవా! యలరఁ దో
చిన భాగవతాప్తిఁ గోరి, శ్రీధవ! మదిలోఁ,
దనరన్, హరీ! పరఁగఁ బో
తనచేఁ దగ వ్రాయఁజేసి, దాన వెలిఁగితే! 89

గర్భిత తేటగీతి:
అలరఁ దోచిన భాగవతాప్తిఁ గోరి,
తడవి, దానిని భక్తియుతమ్ముగాను,
పరఁగఁ బోతనచేఁ దగ వ్రాయఁజేసి,
వఱలి, నమ్మికఁ బెంచితె భక్తిఁ గేశ! 89



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి